గురుగ్రామ్ యూనివర్సిటీలో జరిగిన గ్లోబల్ ఇండియన్ ప్రవాసి కబడ్డీ లీగ్ (GI-PKL) ముగిసింది. ముగింపు వేడుకలో పాల్గొన్న కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి కృష్ణన్ పాల్ గుజర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కబడ్డీకి అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పెరగడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. కోట్లాది మంది ఈ క్రీడను వీక్షిస్తున్న నేపథ్యంలో కబడ్డీని గ్లోబల్ లెవెల్‌కు తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు. ఈ లీగ్‌లో 15కి పైగా దేశాల జట్లు పాల్గొనడం ద్వారా భారత క్రీడా పటిమను ప్రపంచానికి చాటగలిగామని చెప్పారు. జాతీయ క్రీడగా కబడ్డీ ఎదిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
#KrishanPalGurjar #GIPKL2025 #GlobalKabaddi #KabaddiLeague #Sports #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️